Kalki 2898 AD OTT: ఓటీటీలో రిలీజైన కొన్ని గంటల్లోనే కల్కి 2898AD టాప్ 1 ట్రెండింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కల్కి (ఆగస్ట్ 22) రెండు ఓటీటీల్లో, ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కల్కి స్ట్రీమింగ్ కి అందుబాటులో రాగా..హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

తాజాగా కల్కి ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ మూవీగా మారిపోయింది. అయితే ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో 5వ స్థానంలో అడుగుపెట్టిన కల్కి..కొన్ని గంటల్లోనే టాప్ 1కి దూసుకెళ్లింది. ఇక రానున్న రోజుల్లో ఓటీటీలో ఎలాంటి రికార్డులు నెలకొల్పనుందో చూడాలి. 

Also Read :- చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్

ప్రస్తుతం కల్కి 2898AD మూవీ రన్ టైమ్ ను ఓటీటీ కోసం తగ్గించారు మేకర్స్. ఈ సినిమా థియేటర్లలో 181 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా..ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసరికి ఆరు నిమిషాలు తగ్గి 175 నిమిషాలకు చేరింది.అయితే, కట్ చేసిన ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంది. ఈ సీన్ నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో మేకర్స్ దానిని కట్ చేశారు. ఇందులో ప్రభాస్ ను కప్ప అని పిలిచే సీన్ ఒకటి ఉండటం విశేషం. దానిని తీసేసినట్లు ఓటీటీ వెర్షన్ చూస్తే తెలుస్తోంది. ఏదేమైనా ఇండియాన్ మైథాలజీ అంశాలతో రూపొందిన కల్కికి థియేటర్ ఆడియన్స్ చూపించిన అభిమానమే..మళ్ళీ ఓటీటీలో కూడా రిపీట్ కాబోతుంది.