పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ లో పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, టీజర్స్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ కంప్లీట్ అయిందట. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకటి కాదు రెండు ప్రముఖ ఓటీటీలు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నాయట. నెట్ఫ్లిక్స్ సంస్థ కల్కి సినిమాను హిందీలో స్ట్రీమింగ్ చేస్తుండగా.. మిగిలిన భాషల్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ స్ట్రీమింగ్ చేయడానికి ముందుకు వచ్చిందట. ఇందుకోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేశాయట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్దామగా కనిపించనున్నాడు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కల్కి సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. తమిళ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి త్వరలోనే మొదటి సాంగ్ విడుదల కానుంది.