Kalki 2898 AD Sequel: కల్కి 3102 BC.. శ్రీకృష్ణావతారం ముగింపు కథతో సీక్వెల్

Kalki 2898 AD Sequel: కల్కి 3102 BC.. శ్రీకృష్ణావతారం ముగింపు కథతో సీక్వెల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటీవ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ, ఇండియన్ స్టాండర్డ్స్ పెంచడం ఖాయం అంటూ, ఇదోక విజువల్ వండర్ అంటూ కితాబిస్తున్నారు. కథ పరంగా, ప్రెజెంటేషన్ పరంగా, విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also Read:విడాకుల బాటలో మరో స్టార్ కపుల్ ?.. ఫొటోస్ డిలీట్

ఇక భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతానికి, ఫ్యూచర్ జనరేషన్ కి లింక్ చేసిన విధానం అద్భుతమని చెప్తున్నారు. ఇక కల్కి సినిమా క్లిమక్స్ పీక్స్ అని తరువాత వచ్చే సీక్వెల్ కి అదిరిపోయే హింట్ ఇస్తూ సినిమాను ముగించిన తీరు నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో.. కల్కి 2898 ఏడీ సీక్వెల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగానే.. కల్కి సీక్వెల్ కు కల్కి 3102 బీసీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. 

అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కల్కి సీక్వెల్ కథ శ్రీకృష్ణావతారం ముగింపు కథతో రానుందట. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా హింట్ ఇచ్చాడు.  ఎందుకంటే.. ఆ స‌మ‌యంలోనే మ‌హాభార‌తం జ‌రిగింది. శ్రీ‌కృష్ణుడు మాన‌వ‌శ‌రీరాన్ని వీడిన సంవ‌త్స‌రం కూడా అదే. ఇక అక్కడినుండే క‌లియుగం మొదలైంది. కాబట్టి.. కల్కి సీక్వెల్ కు ఇదే పర్ఫెక్ట్ కథ అని ఫిక్స్ అయ్యాడట నాగ్ అశ్విన్. దాంతో.. దాదాపు అదే కథతో కల్కి సీక్వెల్ రానుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా అదే గనుక నిజం అయితే మరో బ్లాక్ బస్టర్ అవడం ఖాయంగా చెప్పొచ్చు.