Kalki 2898 AD Glimps: కల్కి అవతారంలో ప్రభాస్.. హాలీవుడ్ను టార్గెట్ చేసిన నాగ్ అశ్విన్

Kalki 2898 AD Glimps:  కల్కి అవతారంలో ప్రభాస్.. హాలీవుడ్ను టార్గెట్ చేసిన నాగ్ అశ్విన్

సైన్స్ ఫిక్షన్ అండ్ స్కైఫై కథతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ ప్రాజెక్టు K(Project K). ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అమెరికాలోని సాన్ డియాగోలో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్ లో ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 

ఇక ఈ సినిమాకు "కల్కీ 2898 AD(Kalki 2898 AD)" గా టైటిల్ ఫిక్స్ చేశారు. హిందూ పురాణాల ప్రకారం కల్కీ అనేది కలియుగాంతంలో వచ్చే విష్ణుమూర్తి పదవ అవాతారం. ఈ ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి వెలుగులా ఉద్బవిస్తుందని, ఆ అవతారమే కల్కి అని మన పురాణాలలో రాసి ఉంది. ఇక టైటిల్ ప్రకారం ఈ సినిమా 2898 లో జరుగనుందని తెలుస్తోంది. 

ఈ  గ్లింప్స్‌ లో కూడా మన పురాణాలకు సంబందించిన చాలా ఎలిమెంట్స్ ను చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin). శివ లింగం, కల్కి అవతారానికి సంబందించిన విగ్రహం. హిందూ దేవాలయాలు ఇలా చాలా ఎలిమెంట్స్ ను టచ్ చేశారు. చూస్తుంటే ఈ సినిమాను సైంటిఫిక్ గా చూపిస్తూనే మన పురాణాలకు కనెక్ట్ చేసేలా కనిపిస్తోంది. 

ఇక గ్లింప్స్‌లో సూపర్ హీరోగా ప్రభాస్ అదరగొట్టారు. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సారి హాలీవుడ్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరో ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.