Panjagutta PVR: థియేటర్లో వర్షం చినుకులు..‘కల్కి’షో నిలిపివేత!..పోలీస్ కంప్లైంట్!!

గ్రేటర్​లో హైదరాబాద్ లో ఆదివారం (జూలై 14) సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం విజృంభించింది.దాదాపు 6 గంటలు భారీ వర్షం దంచికొట్టడంతో నగరమంతా అతలాకుతలం అయింది. అయితే, పంజాగుట్ట పీవీఆర్ థియేటర్‌లో ‘కల్కి 2898 AD’మూవీ చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. అలాగే,ఆగకుండా వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వచ్చారు.

అయితే,బయట కురుస్తున్న వర్షానికి థియేటర్లోకి నీళ్లు రావడమేంటని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.అకస్మాత్తుగా థియేటర్ పై కప్పు నుంచి నీటి చుక్కలు పడుతుండటం గమనించిన ప్రేక్షకులు కాసేపు అంతా కంగారు పడ్డారు.థియేటర్లో వర్షం నీరు పడుతుంటే కూడా యాజమాన్యం మాత్రం షో నిలిపివేయలేదు.

ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మా ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు.ఇంత జరిగిన కూడా థియేటర్ యాజమాన్యం ఈ మాత్రం వెనక్కి తగ్గలేదు.ఇష్టం ఉన్నవాళ్లు సినిమా చూడండి,లేదంటే వెళ్లిపోవచ్చు అంటూ వెటకారపు సమాధానం ఇచ్చారు.దీంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఆపై థియేటర్ యాజమాన్యం కల్కి షోను నిలిపివేశారు.

Also Read:-మహేష్ బాబు న్యూ లుక్ సూపర్బ్

సినిమా చూడని మాకు తమ టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు ప్రేక్షకులు ఆందోళన చేశారు.సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకున్న ఆడియన్స్ కి థియేటర్ యాజమాన్యం అజాగ్రత్త తో నిరాశే మిగిలింది.ప్రస్తుతం PVR లో వర్షం కురుస్తున్న ఫొటోస్,వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ఏరియాల్లో రోడ్లన్నీ ఏరులు కావడంతో ఎక్కడెక్కడ ట్రాఫిక్​ స్తంభించింది.పలు ఏరియాల్లో చెట్లు,కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ ​సరఫరాలో అంతరాయం ఏర్పడింది.వెంటనే పోలీసులు, బల్దియా, హెచ్​ఎండీఏ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.ఇక రానున్న 48 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఏదేమైనా బయటికి వెళ్లకుండా జాగ్రత్త ఉండండి.