ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం ట్రెమండెస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పటికే పలు దేశాల్లో రిలీజ్ కాగా, ఇప్పుడు జపాన్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేశారు. 2025 జనవరి 3న ఈ చిత్రాన్ని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు శుక్రవారం(Dec 6న) ప్రకటిం చారు.
ఈ సందర్భంగా జపనీస్ భాషలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం 3101 బీసీఈలో మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 ఏడీ కాలాల మధ్య జరుగుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.