ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నట్టు ప్రకటించిన నాగ్ అశ్విన్.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. యాక్టర్స్ దగ్గర్నుంచీ టెక్నీషియన్స్, సెట్ ప్రొపర్టీ లాంటి వాటిపైనా ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్‌లో ఉండే వెహికల్స్‌ని కూడా సిద్ధం చేయడం మొదలు పెట్టాడు. దీనికోసం ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా గ్రూప్‌తో ఓ ఒప్పందం చేసుకున్నాడు.
దీనిలో భాగంగా ఆ వాహనాలని రెడీ చేయడం మొదలుపెట్టి.. దీనికి సంబంధించి శనివారం మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచాడు నాగ్ అశ్విన్ . వెహికల్స్‌ని సిద్దం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నట్టు వీడియో ద్వారా అర్ధమవుతోంది. ముందుగా ఓ వీల్‌ని రెడీ చేశారు. రీ ఇన్వెంటింగ్ ద వీల్ అంటూ ఓ భారీ టైర్‌ను డిఫరెంట్ మోడల్‌లో తయారు చేశారు. ఆల్రెడీ అరవై శాతం షూటింగ్ పూర్తయింది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.