పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో డైరెక్టర్ మారుతి(Maruthi)తో చేస్తున్న సినిమా ఒకటి. అనౌన్స్మెంట్ తోనే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది ఈ సినిమా. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మరో ఇంట్రెస్టింగ్ ప్రభాస్ స్టిల్ ఒకటి..లీక్ అవ్వడంతో..డార్లింగ్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందులో ప్రభాస్ ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. సరికొత్త వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తుండటంతో.. డైరెక్టర్ మారుతి మీద ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇప్పుడు లీక్ అయిన.. ప్రభాస్ స్టిల్..లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన షూట్‌కు సంబంధించిందా..? లేదా ఇంతకు ముందు షూటింగ్‌కు..సంబంధించిన స్టిల్ అనేది క్లారిటీ లేదు. ఓవరాల్గా అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మారుతి ఈ సినిమాను ఎంతో ప్రస్టేజియస్గా తీసుకుని.. కూల్గా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ అందుబాటులో లేని టైములో.. క్యారెక్టర్ ఆర్టిస్టులతో షూట్ కానిచ్చేస్తున్నారు. దీంతో ఈ మూవీ నుంచి త్వరలో టీజర్ అప్డేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదొక హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకు రాజా డీలక్స్(Raja Delux) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్తలు బలంగా వినిపించాయి.
అంతేకాకుండా ఈ సినిమాకు మరో రెండు టైటిల్స్ ను పరిశీలిస్తన్నారట మేకర్స్. అందులో ఒకటి రాయల్ కాగా, మరొకటి అంబాసిడర్. ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు ఫిక్స్ చేయనున్నారని సమాచారం. అయితే..ఈ టైటిల్స్ ను లీక్ చేయడంలో కూడా ఒక స్టాటజీ ఉందట. అదేంటంటే..ఈ రెండు టైటిల్స్ లో ఆడియాన్స్ నుంచి దేనికి మంచి రెస్పాన్స్ వస్తుందో..అదే కన్ఫర్మ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో రీద్దీ కుమార్ (Riddi kumar), మాళవిక మోహన్ (Malavika Mohan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Datt) మరో కీ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
డార్లింగ్ ప్రభాస్ సినిమాలు చూసుకుంటే..బాహుబలి తరువాత వరుసగా సినిమాలు బోల్తా పడుతున్నాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. సలార్ ఊరిస్తోంది కానీ రావడం లేదు. పదే పదే వాయిదాలతో చంపేస్తోంది..త్వరలో సలార్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కల్కి మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి12 న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Vintage prabhas ??
— ʀᴀɢʜᴜ? (@raghu003__) October 14, 2023
6sec video Leaked ?
RT kottu DM pattu#Prabhas #Rajadelux pic.twitter.com/Ld1K9m0BCM