అదంతా తూచ్ అంటూ.. ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్..

అదంతా తూచ్ అంటూ.. ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్..

టాలీవుడ్ సినీ హీరోల్లో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ ప్రభాస్. దీంతో ప్రభాస్ గురించి ఇప్పటికే చాల పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇందులో ఓ తెలుగు హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని, రాజమండ్రికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, బిజినెస్ మెన్ కూతురిని పెళ్లాడబోతున్నాడని ఇలా రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ ప్రభాస్ ఈ పెళ్లి వార్తలపై స్పందించలేదు సరికదా కనీసం పట్టించుకోలేదు. అయితే తాజాగా ప్రభాస్ హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని పెల్లు చేసుకోబోతున్నాడని, అంతేగాకుండా అక్టోబర్‌లో వీరి వివాహం రాజమండ్రిలో ఘనంగా జరగనుందని పలు పుకార్లు వినిపించాయి. 

దీంతో ఈసారి ప్రభాస్ పీఆర్ టీమ్ స్పందించింది. ఇందులోభాగంగా ప్రభాస్ పెళ్లిపై వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేశారు. అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారాలు చేస్తే ఊరుకోమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ప్రభాస్ పెళ్లి రూమర్స్ కి దాదాపుగా చెక్ పడింది.

Also Read :- మహేష్ బాబు సినిమా ఫ్లాప్.. 9 ఏళ్ళ తర్వాత స్పందించిన డైరెక్టర్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న "ఫౌజీ" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతోంది. ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ మారుతి దాసరి డైరెక్ట్ చేస్తున్న "ది రాజాసాబ్" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సీజీ, ఎడిటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో దసరాకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం  సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ కూడా చేస్తున్నాడు, ఇది ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లనుంది.