Prabhas Rajasaab: రాజాసాబ్ సౌండ్ స్టార్ట్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మారుతి

Prabhas Rajasaab: రాజాసాబ్ సౌండ్ స్టార్ట్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మారుతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజాసాబ్ అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా చాలాకాలం క్రితమే మొదలయింది. కానీ, ఇటీవలే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ  నిర్మిస్తున్న ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ మాస్ సినిమా కాకుండా ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ సినిమా చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు. 

ఇక ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా విడుదలైన రాజాసాబ్ డిజిటల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. అదేంటంటే.. రాజాసాబ్ మ్యూజిక్ స్టార్ట్ అంటూ థమన్ తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే.. రాజసాబ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది.