వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో ‘రాజా సాబ్’ కూడా ఒకటి. రొమాంటిక్ హారర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది. ఏప్రిల్ 10న తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొంత భాగం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో ప్రకటించిన డేట్‌కి రిలీజ్ అవడం కష్టమని తెలుస్తోంది. ఈ మేరకే సంక్రాంతికి ప్రభాస్ కొత్త పోస్టర్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారట మేకర్స్.
ALSO READ : మళయాల బ్లాక్ బస్టర్ మూవీ మార్కో సీక్వెల్.?
మరో రెండు నెలలు పోస్ట్ పోన్ అవడం గ్యారెంటీ అని, జూన్‌లో కానీ జులైలో కానీ రిలీజ్ ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌లో ప్రభాస్ ట్రెండీ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు హను రాఘవపూడి తీస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీతో పాటు సలార్ 2, స్పిరిట్, కల్కి 2 చిత్రాలకు ప్రభాస్ కమిట్ అయ్యాడు.