పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇటీవల రిలీజైన సలార్ టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో సలార్ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో ఈ సినిమాపై క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. రెండు స్టేట్స్ కలిపి ఏకంగా రూ.170 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకూ పలికినట్లు టాక్. ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజాం రూ.65 కోట్ల, సీడెడ్ రూ.27 కోట్లు, ఆంధ్రాలో రూ.85 కోట్లు పలికినట్టు సమాచారం.
ఈ ఒక్క ఎగ్జాముపుల్ చాలు సలార్ సినిమాపై బజ్ ఎలా ఉందొ చెప్పడానికి. అయితే.. బజ్ ఎలా ఉన్నా.. ఈ రేంజ్ కలెక్షన్స్ రావాలంటే మాత్రం సలార్ బ్లాక్ బస్టర్ గా నిలవాలి. ఏమాత్రం తేడా వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి సలార్ మూవీ వారికి ఎలాంటి రిజల్ట్ ను మిగుల్చుతుందో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే. ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హోంబేలె ఫిలిమ్స్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.