Salaar Re Release: రీ-రిలీజ్‍లోనూ సలార్ వసూళ్ల ప్రభంజనం.. ఫస్ట్ డే ఎంత వచ్చిందంటే?

Salaar Re Release: రీ-రిలీజ్‍లోనూ సలార్ వసూళ్ల ప్రభంజనం.. ఫస్ట్ డే ఎంత వచ్చిందంటే?

ప్రభాస్ నటించిన హైవోల్టేజ్ యాక్షన్ 'సలార్ పార్ట్ 1' రీ-రిలీజ్‍లోనూ దుమ్మురేపుతోంది. మార్చి 21,2025న థియేటర్లలో రీ-రిలీజైన సలార్ ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. తొలి రోజు రూ.3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎలాంటి స్పెషల్ లేకుండా సడెన్గా రీ-రిలీజైన అయిన కూడా, బాక్సాఫీస్ దగ్గర ఇంతటి వసూళ్లు రాబట్టడం ప్రభాస్కే సాధ్యమంటున్నారు ట్రేడ్ నిపుణులు. అలాగే సలార్ రీ రిలీజ్ లోను భారీ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్నట్లు తెలిపాయి. కేవలం అడ్వాన్స్ బుక్కింగ్స్ ద్వారానే రూ.1.8కోట్లు సాధించింది. ఇక ఈ వారంలో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

అయితే, తొలిరోజు రీ-రిలీజ్‍లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ (₹6 కోట్లు), విజయ్ గిల్లి (₹5 కోట్లు) & సనమ్ తేరి కసమ్ (₹5.35 కోట్లు) సినిమాలుఅత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించాయి. వీటితో పోలిస్తే.. సలార్ వెనుకంజలో ఉంది. 

ఇకపోతే, 2023 డిసెంబర్ 22న రిలీజైన సలార్ రూ.700కోట్లకు పైగా వసూళ్లతో పలు రికార్డులు నెలకొల్పింది. ఇపుడీ రీ రిలీజ్ పేరిట మరిన్ని కొత్త రికార్డులకు సై అంటుంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లో చేసే హంగామాకు సోషల్ మీడియా అంతటా షేక్ అవుతుంది. సలార్ లోని యాక్షన్ సీన్స్ని కట్ చేసి షేర్ చేస్తున్నారు.

అంతేకాకుండా, కొన్ని సీన్లను అనుకరిస్తూ థియేటర్లలో యాక్షన్ కూడా చేసేస్తున్నారు. థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, బాణాసంచా కాలుస్తూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌కి టన్నుల కొద్దీ పేపర్లు కత్తిరించి తీసుకెళ్లారంటేనే సంబరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ రేంజ్ అంటే ఇదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ కేకలతో మోతెక్కించేస్తున్నారు. 

ఇప్పటివరకు రీ రిలీజ్ మూవీస్లో మొత్తం టాప్ కలెక్షన్స్ చూసుకుంటే.. మురారి సినిమాను (2024 ఆగస్టు 9న) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయగా, వసూళ్ళలో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

వారం రోజులపాటు ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శించగా రూ.9.12 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవవర్శిస్ లోను ఈ చిత్రం 60,144 డాలర్లు రాబట్టి మహేష్ కెరీర్లోనే అల్ టైమ్ రికార్డు సొంతం చేసుకుంది. మరి లాంగ్ రన్ లో సలార్ ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.