TheRajasaab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ క్రేజీ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

TheRajasaab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ క్రేజీ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

ప్రభాస్ నుంచి రిలీజ్ కానున్న లేటెస్ట్ మూవీ‘ది రాజా సాబ్’(TheRajasaab). ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది.

ఈ తరుణంలో 'ది రాజా సాబ్' నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మారుతీ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ 2025 సెప్టెంబర్ 24న  విడుదలవుతోందని టాక్. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ నిర్మాణ సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ రూమర్ వినిపించినా.. అది కూడా కన్ఫామ్ కాదని తెలుస్తోంది.

పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా 'ది రాజా సాబ్' సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో రెబల్ ఫ్యాన్స్ను కూల్ చేసేందుకు మే సెకండ్ వీక్లో టీజర్‌ను విడుదల చేయనున్నారట మేకర్స్. అలాగే, ఈ సినిమా VFX క్వాలిటీతో టీమ్ అందరూ సంతృప్తిగా ఉన్నారట. రానున్న టీజర్లో VFX చాలా బాగుంటదని.. దాంతో సినిమా స్థాయి ఏంటనేది తెలుస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ది రాజా సాబ్ షూటింగ్ ఇంకొన్ని పోర్షన్స్ మిగిలే ఉంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్‍లోనే ఉందని సమాచారం. దీంతో వాయిదా తప్పలేదు. వీఎఫ్‍ఎక్స్ పనులకు కూడా మరింత సమయం కావాలని టీమ్ భావిస్తోందట. మరి రానున్న టీజర్ లో రిలీజ్ డేట్ వెల్లడిస్తారో లేదో చూడాలి. 

ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు బ్రహ్మానందం ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందుతోందని అంచనా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.