ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "ది రాజా సాబ్" చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ తదితరులు నటిస్తున్నారు.
ది రాజా సాబ్ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో ప్రభాస్ బైక్ నడుపుతూ, పువ్వులు పట్టుకుని, అద్దంలో తనను తాను చూసుకుంటున్నట్లు చూపించారు.
ALSO READ | ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
ఇటీవలే ది రాజా సాబ్ సెట్స్ నుంచి తీసిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ప్రభాస్ బ్లాక్ కలర్ షర్ట్ లో స్మైల్ ఇస్తూ డైరెక్టర్ మారుతీతో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో ప్రభాస్ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాగే ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2, సాలార్ 2, స్పిరిట్ తదితర చిత్రాల షూటింగ్ బిజిబిజీగా గడుపుతున్నాడు. దీంతో వీలైనంత త్వరగా ది రాజా సాబ్ చిత్ర షూటింగ్ పూర్తీ చేసందుకు డైరెక్టర్ మారుతీ ప్రయత్నిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.