అభిమానికి వీడియో కాల్ చేసిన ప్రభాస్

హైదరాబాద్: హీరో ప్రభాస్ తన అభిమాని కోసం వీడియో కాల్ చేశాడు. అరుదైన ఈ ఘటన శనివారం జరిగింది. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కు తన అభిమాని అయిన శోభిత అమ్మాయి అనారోగ్యంతో హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసింది. బాలిక కోలుకునేందుకు కోసం ఆస్పత్రి వైద్యులు హీరో ప్రభాస్ తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. ఆయన వెంటనే స్పందించారు. శనివారం సాయంత్రం తన అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు ప్రభాస్. 
తన అభిమాన హీరో వీడియో కాల్ చేయడంతో సంతోషంతో శోభిత పొంగిపోయింది. నువ్వు తొందరగా కోలుకుంటావని, మరి భయపడాల్సిన అవసరం లేదని ప్రభాస్ అమ్మాయికి ధైర్యం చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ‘‘ఆదిపురుష్, సలార్..’’ సినిమాల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీలతో బిజీ అయిపోయిన ప్రభాస్ చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు.