ఏంటీ ... ఆ ప్రభాస్ సినిమాని 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారా..?

ఏంటీ ... ఆ ప్రభాస్ సినిమాని 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారా..?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "ది రాజాసాబ్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మారుతి దాసరి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా మాళవిక మోహనన్, నిధి అగార్వల్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాసెట్స్ మీదకి వెళ్లి దాదాపుగా 4ఏళ్ళు అవుతుంది. కానీ రిలీజ్ అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. 

అయితే "ది రాజాసాబ్" సినిమాకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే రాజాసాబ్ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో ప్రస్తుతం హర్రర్ జోనర్ సినిమాలకి మంచి స్కోప్ ఉంది. దీంతో నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే "ది రాజాసాబ్" రిలీజ్ లేట్ అవుతోందని మరికొందరు అంటున్నారు. అయితే రాజాసాబ్ రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ తమన్  ఒకప్పుడు బాలీవుడ్ లో బాగా ట్రెండ్ అయిన ఇన్సాఫ్ అప్నా లాహో సె సినిమాలోని హవా హవా" అనే సాంగ్ ని ది రాజాసాబ్ లో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ని ఇప్పుడున ట్రెండ్ కి అనుగుణంగా ట్యూన్ చేస్తున్నాడని, అంతేగాకుండా ఈ పాట రీమిక్స్ హక్కుల కోసం దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. 

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రల్ లో రాజాసాబ్ సినిమా రిలీజ్ అనుమానమేనని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పలు VFX తోపాటూ ఎడిటింగ్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ దసరాకి వాయిదా పడనుందని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.