టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'రాజాసాబ్'. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మారుతీ దాసరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని కామెడీ యాక్షన్ హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై 2 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ సంక్రాంతి విషెష్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అనే క్యాప్షన్ పెట్టారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. అయితే గతంలో ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం పూర్తికాలేదు. అంతేకాకుండా ఎడిటింగ్ & గ్రాఫిక్స్ విభాగంలోని పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. దీంతో అనుకున్న సమయానికి 'రాజాసాబ్' సినిమా రిలీజ్ కాకపోవచ్చని సినీ వర్గాల సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ దాదాపుగా 4 బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజిబిజీగ గడుపుతున్నాడు. ఇందులో ఇప్పటికే సలార్ 2 సినిమా 50% శాతం షూటింగ్ పూర్తీ చేసుకోగా కల్కి 2898 AD ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ మీదకి వెళ్లనుంది. దీంతో ఈ రెండు సినిమాలకంటే ముందుగా రాజాసాబ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.