‘హనుమాన్’ డైరెక్టర్తో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసిన ప్రభాస్.. టైటిల్ అదేనా..?

‘హనుమాన్’ డైరెక్టర్తో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసిన ప్రభాస్.. టైటిల్ అదేనా..?

తెలుగు సినిమాను డైరెక్టర్ రాజమౌళితో కలిసి పాన్ ఇండియా స్థాయిని దాటించిన రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత స్పీడ్ పెంచాడు. కామెడీ-హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ‘రాజా సాబ్’ మూవీని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా కన్నప్ప, ఫౌజీ, సలార్-2, కల్కి-2 మొదలైన సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమాలను వెంట వెంటనే రిలీజ్ చేసేలా షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నాడు. 

అయితే ఈ ప్రాజెక్టులు ఒకవైపు నడుస్తుండగానే.. మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు రెబల్ స్టార్. హనుమాన్ మూవీతో అద్భుతమైన హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మతో పాన్ ఇండియా మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ప్రశాంత్ వర్మ కథ చెప్పగా ప్రభాస్ కు నచ్చిందట. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఇవాళ (ఫిబ్రవరి 26) శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లో లుక్ టెస్ట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్  వర్మ. 

పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీని కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కన్నడ ప్రొడక్షన్ సంస్థ హొంబలే నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయనుందట. అయితే ఈ సినిమా ముందుగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో తీయాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్. రణ్ వీర్ తో లుక్ టెస్ట్ చేసినప్పటికీ.. సినిమా ముందుకు సాగలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు ప్రభాస్ పర్ఫెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యాడట. బ్రహ్మరాక్షస్ లేదా బ్రహ్మ రాక్షసుడు అనే టైటిల్ తో ఈ మూవీ రానుందని టాక్. చూడాలి మరి.. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ మూవీ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.