Prabhas: రాజా సాబ్ రిలీజ్ డేట్ మారింది..

Prabhas: రాజా సాబ్ రిలీజ్ డేట్ మారింది..

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.  వాటిలో ‘రాజా సాబ్‌‌‌‌‌‌‌‌’ కూడా ఒకటి.  రొమాంటిక్ హారర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి  ఏప్రిల్ 10న తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొంత భాగం షూటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ ఉండటంతో రిలీజ్ పోస్ట్ పోన్ కావడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. 

ఇక  ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.  నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్  హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.