యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బాహుబలి(Bahubali) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ సినిమాలో బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచిన విషయం కూడా తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
#RebelStarPrabhas #Prabhas #Mysore pic.twitter.com/5vEsCXcCgV
— Fukkard (@Fukkard) September 25, 2023
తాజాగా ఇప్పుడు ఆ మరోసారి ప్రభాస్ మైనపు బొమ్మ చర్చనియ్యాంశం అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మైసూర్ లో ఓ మ్యూజియంలో ప్రభాస్ బాహుబలి పాత్రకు సంబందించిన మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మను చూసి నెటిజన్స్ మాత్రం ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఆ మైనపు విగ్రహం కొంచం కూడా ప్రభాస్ లా లేకపోవడం, చూడటానికి కూడా అదోలా ఉండటంతో ఫుల్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మైనపు విగ్రహం ఏర్పాటు పై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ను ఏంట్రా ఇలా తయారు చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రభాస్ మైనపు బొమ్మ తెగ వైరల్ అవుతోంది.