టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ తదితర స్టార్లు నటిస్తున్నారు. దీంతో విష్ణు ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో బడ్జెట్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ కాకుండా దాదాపుగా రూ.150 కోట్లు పైగా ఖర్చు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
కన్నప్ప సినిమాలోని ప్రభాస్ రెమ్యునరేషన్ పై ఆసక్తి నెలకొంది. మాములుగా ప్రభాస్ ఎప్పుడూ రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్ ని బట్టి దాదాపుగా రూ.100 నుంచి రూ.150 కోట్లకి పైగా తీసుకుంటుంటాడు. కొన్ని సందర్భాల్లో సినిమా ప్రాఫిట్స్ లో షేర్స్ కూడా ఇస్తుంటారు నిర్మాతలు. అయితే కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయు కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. గతంలో ప్రముఖ స్వర్గీయ నటుడు కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేశాడు. ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్ అయ్యింది.
ALSO READ | చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..
అలాగే ప్రభాస్ కి మంచి విష్ణు కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రభాస్ జీరో రెమ్యునరేషన్ తో కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. ఈ అంశం కన్నప్ప సినిమాకి బాగానే కలసి వస్తుందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇందులో కల్కి 2898AD, స్పిరిట్, సలార్ 2, ది రాజాసాబ్, ఫౌజీ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆ మధ్య ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలో గాయపడటంతో కొంతకాలం విశ్రాంతి తరవాత మళ్ళీ సెట్స్ లోకివచ్చాడు.