Kalki 2898 AD Box Office Day 11: కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 900 కోట్లు..మరి ఇండియా వైడ్ ఎంతంటే?

Kalki 2898 AD Box Office Day 11: కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 900 కోట్లు..మరి ఇండియా వైడ్ ఎంతంటే?

కల్కి 2898 AD (Kalki 2898 AD)..ప్రభాస్ (Prabhs) హీరోగా వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ వైడ్ గా గుర్తింపు పొందింది.ఈ ఏడాది(2024)రిలీజైన ఇండియ‌న్ సినిమాల్లో కల్కి అరుదైన ఘనత సాధించింది.రిలీజైన పదకొండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.900కోట్లకి పైగా వసూళ్లు చేసిన చిత్రంగా క‌ల్కి రికార్డ్ నెల‌కొల్పింది. 

తాజా విషయానికి వస్తే..కల్కి జూన్ 27న తెలుగు,హిందీ,తమిళం,కన్నడ మరియు మలయాళం అనే ఐదు భాషల్లో రిలీజై..11 రోజుల్లోనే ఇండియా వైడ్ గా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ మేనియాను బాక్సాఫీస్ వద్ద రెట్టింపు చేస్తోంది.అలాగే,అమెరికన్ బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. 

ప్రముఖ నివేదికల ప్రకారం..కల్కి 2898 AD ఇండియాలో అన్ని భాషల్లో రూ.507 కోట్లు వసూలు చేసింది.ఆంధ్రా,నైజాం ప్రాంతాల్లో ఈ మూవీ 153 కి పైగా కోట్ల రూపాయల నికరంగా,236 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో అన్ని భాషల్లో 507 కోట్ల రూపాయలు గ్రాస్, 200 కోట్ల షేర్ రాబట్టింది. ఇండియాలో ఈ సినిమా 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.హిందీలో ఇప్పటి వరకు రూ.200 కోట్ల షేర్ రాబట్టింది. 11వ రోజు కూడా 20 నుంచి రూ.25 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక ఓవర్సీస్‌లో చూసుకుంటే..ఈ చిత్రం ఇప్పటి వరకు 30 మిలియన్ డాలర్లు వసూళ్లను సాధించింది. ఈ వసూళ్లతో యూకే,యూఎస్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. యూకేలో పొన్నియన్ సెల్వన్,జైలర్ రికార్డులను బ్రేక్ చేసింది.ప్రస్తుతం విజయ్ లియో,బాహుబలి 2 సినిమా కలెక్షన్లకు చేరువైంది. ఇకపోతే..11వ రోజు కల్కి ఓవర్సీస్‌లో 8.5 కోట్ల రాబడుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

ఇదివరకే,అమెరికన్‌ ఆడియన్స్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేస్తూ..సినిమాను చాలా పెద్ద స్థాయిలో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలని తెలిపారు. 

ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ గా తీసుకొని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ నాగ్ అశ్విన్ అంతర్జాతీయంగా పొగిడేస్తున్నారు.విజువల్స్,గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని, దర్శకుని ఊహకు, దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ సైతం నాగ్ మేకింగ్ స్టైల్ కు ఫిదా అవుతున్నారు.