
టాలీవుడ్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్ పాపులర్ అవుతున్నారు. అయితే ఇప్పటికే భారత్ లో అగ్రగామి అయిన బాలీవుడ్ సినీ పరిశ్రమలో సైతం తెలుగు హీరోల సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దీంతో తెలుగు హీరోలకి నార్త్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర హీరోలకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
కాగా ఇటీవలే తెలుగుతోపాటూ హిందీలో కూడా రిలీజ్ అయిన కల్కి 2898 AD, దేవర, పుష్ప 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిందీ హీరోల సినిమా రికార్డులు బద్దలు కొట్టాయి. అయితే ఇటీవల ఒర్మాక్స్ మీడియా భారతదేశంలోని మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ లో ఉన్నాడు.
రెండో స్తానంలో తమిళ్ తళపతి విజయ్ ఉండగా పుష్ప 2: ది రూల్ సినిమాతో సెన్సేషన్స్ సృష్టించిన అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ ని వెనక్కి నెట్టి 3వ స్థానంలో నిలిచాడు. అయితే ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి కేవలం ఇద్దరు హీరోలు బాద్ షా షారుఖ్ ఖాన్ (4వ స్థానం), అక్షయ్ కుమార్(10వ స్థానం) మాత్రమే ఉన్నారు. గత ఏడాది ఈ లిస్ట్ లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈసారి టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక 5వ స్థానంలో దేవర చిత్రంతో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు.
భారతదేశంలోని మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్:
1. ప్రభాస్
2. తలపతి విజయ్
3. అల్లు అర్జున్
4. షారుఖ్ ఖాన్
5. జూనియర్ ఎన్టీఆర్
6. అజిత్ కుమార్
7. మహేష్ బాబు
8. సూర్య
9. రామ్ చరణ్
10. అక్షయ్ కుమార్