SRH vs PBKS: నిరాశపరిచిన ఆరంజ్ ఆర్మీ.. పంజాబ్ భారీ స్కోర్

SRH vs PBKS: నిరాశపరిచిన ఆరంజ్ ఆర్మీ.. పంజాబ్ భారీ స్కోర్

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్(71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకం బాదగా.. అథర్వ తైడే(46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిలీ రోసో(49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (32 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఓపెనర్లు అథర్వ థైడే (27), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33) ఆదిలో నెమ్మదించినా.. అనంతరం చెలరేగిపోయారు. బౌండరీల మోత మోగించారు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ఆ తరువాత స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, విజయకాంత్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. పంజాబ్ జోరు మాత్రం తగ్గలేదు. షాబాజ్‌ వేసిన 8వ ఓవర్‌లో 13 పరుగులు, వియస్కాంత్ వేసిన 9వ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.

 
ఈ జోడి హైదరాబాద్‌ బౌలర్లకు ఏ చిన్న అవకాశమూ ఇవ్వలేదు. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ సమయంలో పంజాబ్ వేగానికి నటరాజన్‌ అడ్డుకట్ట వేశాడు. పదో ఓవర్‌ తొలి బంతికి అథర్వ తైడే (27 బంతుల్లో 46)ని పెవిలియన్ చేర్చాడు. అనంతరం రోసో-ప్రభ్‌సిమ్రన్ సింగ్ కాసేపు మెరుపులు మెరిపించారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి వేసిన 12వ ఓవర్‌లో  రోసో 20 పరుగులు రాబట్టాడు. దీంతో పంజాబ్ 230పైగా స్కోర్ చేసేలా కనిపించింది. అయితే చివరి 4 ఓవర్లను కమిన్స్ సేన కట్టడి చేయడంతో స్కోరు 220 పరుగుల లోపే ఆగింది. 

 

ఆరంజ్ ఆర్మీ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్ 1, విజయకాంత్ ఒక వికెట్ తీసుకున్నారు.