Choreographer Son: కొడుకును పరిచయం చేసిన స్టార్ కొరియోగ్రాఫర్.. తగిన వారసుడొచ్చాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు

Choreographer Son: కొడుకును పరిచయం చేసిన స్టార్ కొరియోగ్రాఫర్.. తగిన వారసుడొచ్చాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు

సినీ ఇండస్ట్రీలో ఇండియన్ మైఖేల్ జాక్సన్గా కొరియోగ్రాఫర్ ప్రభుదేవాది (Prabhu Deva) ప్రత్యేక స్థానం. ప్రస్తుతం ఆయన హీరో, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్గా రాణిస్తూ బిజీగా ఉన్నాడు. మూడు దశాబ్దాలుగా ప్రభుదేవా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అనేక అవార్డులతో గుర్తింపు పొందాడు. అయితే, ప్రభుదేవా వారసుడి సినీ ఎంట్రీపై ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ తరుణం వచ్చేసింది.

ప్రభుదేవ-లతా కుమారుడు రిషి రాగ్వేందర్ దేవాను (Rishii Ragvendar Deva) ఒక పవర్ ఫుల్ డ్యాన్స్ వీడియో ద్వారా పరిచయం చేశారు. చెన్నైలో జరిగిన లైవ్ డ్యాన్స్ కచేరీలో తండ్రి కొడుకులిద్దరూ ఫస్ట్ టైం కలిసి ప్రదర్శన ఇచ్చి అభిమానులను కనువిందు చేశారు. 

ప్రభుదేవా తన కొడుకు స్టేజీ పెర్ఫార్మెన్స్ వీడియో షేర్ చేసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. కొడుకుని అభిమానులుకి పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఇది కేవలం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాదని అంతకు మించి అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

Also Redc:-డైరెక్టర్ రాజమౌళి టార్చర్ అంటూ.. శ్రీనివాసరావు వీడియో..

ఇకపోతే, రిషి తన తండ్రి సిగ్నేచర్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తున్న విజువల్స్, తనలోని ప్రతి కదలిక ప్రభుదేవాని గుర్తుచేస్తున్నాడు. మొత్తానికి రిషి నిజంగా తన తండ్రికి తగ్గ కొడుకు అని తన ఎంట్రీ వీడియో ద్వారా అర్ధమయ్యేలా చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూశాక.. అభిమానులు రిషిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రభుదేవా నృత్య వారసత్వానికి తగిన వారసుడు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ప్రభుదేవ మొదటి భార్య లతాకు ఇద్దరు కుమారులు. వాళ్లలో రిషి ఒకడు. మరొకరు అదిత్. రెండవ భార్య హిమానికి ఒక కూతురు ఉంది. ప్రభుదేవా తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు (రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్) కూడా డ్యాన్స్ మాస్టార్లే కావడం విశేషం.