ప్రభుదేవా(Prabhu Deva) హీరోగా వినూ వెంకటేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వుల్ఫ(Wolf). ప్రభుదేవా కెరీర్లో 60 వ చిత్రంగా రాబోతుండటం విశేషం.ఇవాళ (ఆగష్టు 2న) పోస్టర్ రిలీజ్ అయింది. ప్రభుదేవా వెరీ ఇంటెన్సివ్ లుక్ తో కనిపిస్తోండగా..ఒక తోడేలు రెక్కలు,కొమ్ములు ఆకారంలో ఒక మనిషి లాంటి విగ్రహం..దాని ముందు పడుకోబెట్టిన ఒక మనిషితో..పోస్టర్ ఆకట్టుకుంటుంది. రేపు (ఆగస్టు3న) ఉ.11 గంటలకు వుల్ఫ నుంచి టీజర్ రిలీజ్ మేకర్స్ ప్రకటించారు.
ప్రభుదేవా మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో అంజు కురియన్, లక్ష్మీ రాయ్, MS భాస్కర్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకు అంబరీషన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. గత సంవత్సరం షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుండగా..మరికొన్ని రోజుల్లో మూవీ షూటింగ్ తుది దశకు చేరుకోనుందని సమాచారం.
ఈ మూవీను సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నిర్మిస్తున్నారు.
????? ???? ?????? ?@PDdancing 's 60th film #WOLF ? Teaser From Tomorrow 1⃣1⃣AM#WolfTeaser Releasing in ?????, ???????, ?????? & ?????@SandeshPro @vinoovenketesh @ImSimhaa @iamlakshmirai @anusuyakhasba @AnjuKurian10 @shreegopika1… pic.twitter.com/CdtB2itr4P
— T-Series South (@tseriessouth) August 2, 2023