కాకినాడ రేచర్లపేటకు చెందిన కుంచే ప్రభుతేజ యువకుడు (25) తీవ్ర రక్తగాయాలతో కాకినాడ కోర్టు ఆవరణలోకి వెళ్లాడు. తనపై రాజు, రాజేష్, విక్కీ, సాగర్ అనే నలుగురు తనపై దాడి చేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జడ్జికి విన్నవించాడు. ముందు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందిగా ప్రభు తేజకు న్యాయమూర్తి సూచించి.. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుతేజను చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు పొలీసులు తరలించారు గతంలో రెండు వర్గాల మధ్య విభేదాలున్నాయి. ఈ అంశంపై పోలీసులు మాట్లాడుతూ.. 2021లో ప్రభుతేజకు ఇంటి చుట్టుపక్కల వారితో గొడవలు అయ్యాయన్నారు. అయితే ఎలాంటి గొడవలు జరగలేదని స్థానికులు చెప్పారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ .. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలింపు
కేసు నమోదు చేసుకున్న ప్రాధమిక విచారణలో ప్రభుతేజను ఎవరు గాయ పరచలేదని, అతను చెప్పే ప్రదేశంలో ఈరోజు అసలు ఎలాంటి గొడవ జరగలేదని తేలింది. 2021 లో ఇలాగే తనకు తాను గాయాలు చేసుకుని వాటిని తీవ్ర రక్తగాయాలుగా హల్చల్ చేసి హాస్పిటల్ లో చేరగా అప్పుడు .. ఇతని ఫిర్యాదు మేరకు Cr.No.184/2021 u/s 448,324 r/w 34 IPC గా కేసు నమోదు చేసి విచారించగా .. తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని తమ విచారణలో తేలడంతో .. ఫాల్స్ కేసుగా నిర్దారించి . .. క్లోజ్ చేశారు. ఆ తరువాత ప్రభు తేజ ఆత్మహత్యాయత్నం చేయగా 3 టౌన్ పోలీస్ వారు Cr.No.98/2021 u/s 309 IPC గా కేసునమోదు చేసినారు. ఈ కేసులో ఈ రోజు ( జులై10) కోర్టుకు హాజరు కావలసి యున్నది. అయితే ముద్దాయి ప్రభు తేజ పై ఈ రోజు ఎలాంటి దాడి జరగలేదని పోలీసులు తెలిపారు. ముద్దాయికి గాయాలు ఎలా అయ్యాయి అనే విషయంపై లోతుగా విచారణ జరిపి.. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.