హైదరాబాద్, వెలుగు: పీఎల్ అసెట్మేనేజ్మెంట్ కంపెనీ (ప్రభుదాస్ లీలాధర్ గ్రూప్ అసెట్మేనేజ్మెంట్) ఆక్వా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్(పీఎంఎస్) తొలి సంవత్సరంలో 76 శాతం రాబడిని ఇచ్చింది. క్వాంట్- బేస్డ్ స్ట్రాటజీతో రూ.340-కోట్ల అసెట్ అండర్మేనేజ్మెంట్(ఏయూఎం) మార్క్‌ను అధిగమించింది. ఇదే సమయంలో బీఎస్ఈ 500 రాబడి 37 శాతం మాత్రమే ఉందని పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఆక్వా అనేది మానవ ప్రమేయం లేని 100 శాతం క్వాంట్-ఆధారిత వ్యూహం. పోర్ట్‌ఫోలియో మిక్స్‌ను తయారు చేయడానికి వెయ్యి ఇండికేటర్లను విశ్లేషిస్తుంది. పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, స్టాక్ మార్కెట్ నిపుణులు కస్టమర్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను నిర్వహించడాన్ని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ (పీఎంఎస్) అంటారు.