
హైదరాబాద్, వెలుగు: ఎన్బీఎఫ్సీ ప్రచయ్క్యాపిటల్ లిమిటెడ్ సెక్యూర్డ్, రిడీమబుల్నాన్–కన్వర్టబుల్ ఎన్సీడీల పబ్లిక్ ఇష్యూ ఈ నెల 28న మొదలై వచ్చే నెల 15న ముగుస్తుందని ప్రకటించింది. ఇష్యూ ద్వారా రూ.100 కోట్లు సేకరిస్తామని తెలిపింది. ఇవి బీబీబీ/స్టేబుల్ క్రిసిల్ రేటెడ్ ఎన్సీడీలు కాగా ఏడాదికి 13 శాతం వడ్డీ చెల్లిస్తారు.
ఫండ్ యుటిలైజేషన్ కోసం ఈ డబ్బును వాడతామని ప్రచయ్ క్యాపిటల్ ఎండీ గిరీశ్ మురళీధర్ చెప్పారు. తమ ఏయూఎం విలువ గత మార్చి నాటికి రూ.285.70 కోట్లకు చేరిందని అన్నారు.