మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రచయ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌సీడీలు

మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రచయ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌సీడీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రచయ్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ తన నాన్ కన్వర్టబుల్‌‌‌‌‌‌‌‌ డిబెంచర్ల (ఎన్‌‌‌‌‌‌‌‌సీడీల) ను బీఎస్‌‌‌‌‌‌‌‌ఈలో  లిస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 న ఓపెనైన కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 106 శాతం సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయ్యింది. ఈ ఇష్యూ  మార్చి 13 తో ముగిసింది. కంపెనీ రూ.50 కోట్లు సేకరించింది. క్రిసిల్‌‌‌‌‌‌‌‌ నుంచి  బీబీబీ లేదా స్టేబుల్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ పొందిన ఈ కంపెనీ ఎన్‌‌‌‌‌‌‌‌సీడీలు ఏడాదికి 13 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. వడ్డీ చెల్లింపులు నెలవారీ  జరుగుతాయి.