వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్

వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
  • సెంటర్లను పరిశీలించిన డీఐఈఓ అంజయ్య

వనపర్తి టౌన్, వెలుగు:  వనపర్తి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లాలో మొత్తం 18 ఎగ్జామ్స్ సెంటర్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో జనరల్ 13 సెంటర్లు, ఒకేషనల్ 5 సెంటర్లలో కొనసాగాయి. ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెంటర్లను  డీఐఈఓ అంజయ్య తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

ఇంటర్ బోర్డు రూల్స్ ప్రకారం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆయన ఆదేశించారు. మంగళ వారం నిర్వహించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో మార్నింగ్ సెషన్ లో 93.57 శాతం, ఈవెనింగ్ సెషన్  96.66 శాతం చొప్పున హాజరైనట్లు డీఐఈఓ వెల్లడించారు.