మహబూబ్‌నగర్, వెలుగు : గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కెమికల్స్ లేకుండానే స్టూడెంట్లతో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. నాలుగేండ్ల నుంచి ప్రాక్టికల్ఎగ్జామ్స్నిర్వహణకు రాష్ట్ర సర్కారు నుంచి రూపాయి రాకపోవడంతో.. ఉన్న వాటినే అడ్జెస్ట్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్‌కు వాడాల్సిన కెమికల్స్‌ను ఇద్దరు, ముగ్గురికి వాడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సబ్జెక్టులకు ఎక్విప్‌మెంట్, కెమికల్స్ లేకపోవడంతో.. ఎగ్జామ్ నిర్వహించకుండానే పాస్ చేస్తున్నట్లు సమాచారం.
పెన్నులు, పేప్లకు కూడా చాలని ఫండ్స్
బోర్డ్ఆఫ్ఇంటర్మీడియట్ఈ నెల 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 36 ప్రభుత్వ, ప్రైవేట్జూనియర్ కాలేజీలు ఉండగా.. ఒకేషనల్ఫస్ట్ ఇయర్‌లోని 2,009 మంది స్టూడెంట్లు, సెకండ్ ఇయర్‌లో 1,649 మంది, రెగ్యులర్సెకండ్ ఇయర్‌లో ఎంపీసీ, బైపీసీ సబ్జెక్టులకు చెందిన 9,286 మంది స్టూడెంట్లు అవుతున్నారు. ప్రైవేట్కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించి అన్ని రకాల ఎక్విప్‌మెంట్, కెమికల్స్ అందుబాటులో ఉండగా.. గవర్నమెంట్కాలేజీల్లో కొన్ని అందుబాటులో లేవు. కెమిస్ట్రీకి సంబంధించి 24 రకాల కెమికల్స్‌కు గాను... కొన్ని కాలేజీలో సగం కూడా లేవు. ప్రాక్టికల్స్నిర్వహణ కోసం బోర్డ్ఆఫ్ ఇంటర్మీడియట్నుంచి ప్రతి ఎంపీసీ స్టూడెంట్‌కు రూ.16 చొప్పున, ప్రతి బైపీసీ స్టూడెంట్‌కు రూ.24 చొప్పున ఫండ్ ఇస్తున్నా.. అవి దేనికి సరిపోవడం లేదు. ఈ పైసలు కేవలం రెడ్, బ్లూ కలర్స్కెచ్పెన్నులు, కలర్ పెన్స్, ఏ4 సైజ్ పేపర్లు కొనడానికే సరిపోతున్నాయి.
‘డే టు డే’ ఫండ్స్ రావట్లే..
ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్‌కాలేజీలో చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ ‘డే టు డే’ ఎక్స్‌పెండిచర్ కింద ఏటా రూ.76 చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక కాలేజీలో వంద మంది స్టూడెంట్లు ఉంటే.. ఆ కాలేజీకి ఏడాదికి రూ.7,600 చెల్లిస్తుంది. వీటితోనే ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ మెటీరియల్స్, చాక్‌పీసులు, ఇతర స్టేషనరీ కొనాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం నాలుగేళ్లుగా ఈ ఫండ్స్ ఇవ్వడం లేదు. దీంతో ప్రిన్సిపాళ్లు సొంత డబ్బును ఖర్చు చేసి వీటిని కొనాల్సి వస్తోంది. దీనిపై ఎస్టీవో బిల్లులు చేస్తున్నా... శాంక్షన్లభించడం లేదు. ఈ-కుబేర్‌లో నెలల తరబడి ఈ బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఒకే సారి ఇద్దరికి..
రూల్ ప్రకారం ప్రతి స్టూడెంట్‌కు విడివిడిగా ప్రాక్టికల్స్ నిర్వహించాలి. కానీ, కొన్ని గవర్నమెంట్కాలేజీల్లో కెమికల్స్, పరికరాల కొరత వల్ల ఇద్దరిద్దరితో కలిపి చేయిస్తున్నారు. కొన్నింటికి కెమికల్స్లేకపోవడంతో ఆ ప్రాక్సికల్స్ను వదిలేయాలని సార్లే స్టూడెంట్లకు చెబుతున్నారు. దీనికితోడు చాలా వరకు ప్రాక్టికల్ థియరీకి సంబంధించి సిలబస్ కూడా పూర్తి కాలేదని స్టూడెంట్లు తెలిపారు. రికార్డ్స్వరకే రాసి, ప్రాక్టికల్స్‌కు వచ్చే సరికి వాటిని వదిలేస్తున్నారు.
తగ్గుతున్న సామర్థ్యాలు..
ప్రస్తుతం ఇంటర్ సెకండ్ఇయర్ చదువుతున్న స్టూడెంట్లు కొవిడ్ కారణంగా పరీక్షలు రాయలేదు. ప్రభుత్వం వీరందరినీ పాస్ చేసింది. గత ఎడ్యుకేషన్ ఇయర్‌లో వీరి ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ కాగా, కాలేజీలను మూడు నెలలు ఆలస్యంగా తెరిచారు. దీంతో వీరికి పూర్తి స్థాయిలో సిలబస్ కాకుండానే ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు అకడమిక్ ఇయర్ మొదట్లోనే కాలేజీలు తెరిచినా, అరకొర సౌకర్యాలతో ప్రాక్టికల్స్‌ను పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. దీని వల్ల వీరిలో సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది.
ఉన్న వాటితోనే ప్రాక్టికల్స్ చేశాం
సెకండ్ ఇయర్‌లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో కొన్ని మూలకాల ఫలితం రాబట్టడానికి నిర్ధారణ టెస్టులు చేయాల్సి ఉంటుంది. జువాలజీ, బొటనీలో కొన్ని విచ్ఛేదనలు కూడా ఉంటాయి. అయితే కాలేజీలో వీటికి సంబంధించిన మెటీరియల్, కెమికల్స్ లేకపోవడంతో లెక్చరర్లు ఉన్న వాటితోనే ప్రాక్టికల్స్ చేయించారు.
–మహేందర్, బైపీసీ సెకండ్ ఇయర్, మహబూబ్‌నగర్
ఇద్దరం కలిసి చేశాం
మా కాలేజ్‌లో సరిపడా కెమికల్స్, ఎక్విప్‌మెంట్ లేవు. ప్రాక్టికల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని సార్లు ఇద్దరిద్దరితో కలిపి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. సార్ వాళ్లు చెప్పినట్లే మేం కూడా ఇద్దరిద్దరం కలిపి ప్రాక్టికల్స్ చేస్తున్నాం. కానీ, ఏం అర్థం కావడం లేదు.
–నవీన్, బైపీసీ సెకండ్ ఇయర్, అడ్డాకుల
ఫండ్స్ ప్రాబ్లం లేదు
ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎంపీసీ స్టూడెంట్‌కు రూ.16, బైపీసీ స్టూడెంట్‌కు రూ.24 చొప్పున మంజూరు అయ్యాయి. అన్ని కాలేజీల్లో సరిపడా ఎక్విప్‌మెంట్, కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి లేని చోట్ల తెచ్చుకోవాలని ప్రిన్సిపాల్స్‌కు చెప్పాం.
వెంకటేశ్వర్లు, డీఐఈవో, మహబూబ్‌నగర్