మంత్రి ప్రశాంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి : ప్రదీప్ ఈశ్వర్

బాల్కొండ, వెలుగు:  ప్రజలకు మంత్రి ప్రశాంత్​ రెడ్డి క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్  డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు పై మంత్రి వేముల వాఖ్యలను ఖండిస్తూ  బుధవారం వేల్పూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన బైఠాయించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాల అమలుపై బహిరంగ చర్చకు రావాలని విసిరిన సవాల్​  స్వీకరించకుండా తప్పు తెలుసుకుని మంత్రి వెనుదిరిగారని ఈశ్వర్ అన్నారు.   కార్యక్రమంలో   నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.