Dragon Collection Day 1: యూత్ పల్స్ పట్టేసిన ప్రదీప్ రంగనాథన్.. డ్రాగన్ ఫస్ట్ డే ఏకంగా అన్ని కోట్లు రాబట్టిందా.?

Dragon Collection Day 1: యూత్ పల్స్ పట్టేసిన ప్రదీప్ రంగనాథన్..  డ్రాగన్ ఫస్ట్ డే ఏకంగా అన్ని కోట్లు రాబట్టిందా.?

లవ్ టుడే మూవీ ఫేమ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’.. ఈ సినిమా శుక్రావారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఓరి దేవుడా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్, KS రవి కుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్, మరియం జార్జ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. 

మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కాలేజీ లైఫ్, జాబ్ లైఫ్ ని బేస్ చేసుకుని రాసిన సీన్స్ యూత్ ని కట్టి పడేశాయి. దీంతో తమిళ్ తో పాటూ మొదటి రోజు తెలుగులో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది.

ALSO READ | మూవీ రివ్యూ: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’.. ఒకేసారి 48 సబ్జెక్టులు పాసయ్యాడా..?

Sacnilk సమాచారం ప్రకారం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ మొదటి రోజు తెలుగు, తమిళ్ లాంగ్వేజస్ లో దాదాపుగా రూ.6.75 కోట్లు కలెక్ట్ చేసినట్లు  సమాచారం. ఇందులో తమిళనాడులో రూ.5 కోట్లు రాగా, తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.1.75 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. గతంలో ప్రదీప్ హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన లవ్ టుడే సినిమా 2.8 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే మొదటి షో పడిన తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. దీనికోతోడు ఈ వారం తెలుగులో రిలీజ్ సినిమాలు తేలిపోవడంతో డ్రాగన్ కి కలెక్షన్లు పెరుగుతున్నాయి. దీంతో షోలు కూడా పెంచినట్లు సమాచారం.