
కోలీవుడ్ యంగ్ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ సినిమా "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్". ఈ సినిమాని తమిళ్ ప్రముఖ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్, KS రవి కుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్, మరియం జార్జ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యింది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఆక్యుపెన్సీతో కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.
అయితే ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో 30శాతానికి పైగా తెలుగు వెర్షన్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ విషయన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇటీవలే తమిళ్ లో రిలీజ్ అయిన పట్టుదల రూ.140 కోట్లు కలెక్ట్ చేసింది. త్వరలోనే డ్రాగన్ అజిత్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హీరో ప్రదీప్ కెరీర్ లో లవ్ టుడే సినిమా కలెక్షన్స్ టాప్ లో ఉన్నాయి. కానీ డ్రాగన్ ఈ సినిమా కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కాలేజీ లైఫ్, జాబ్ లైఫ్ ని బేస్ చేసుకుని రాసిన సీన్స్ యూత్ ని కట్టి పడేశాయి. దీంతో తమిళ్ తో పాటూ మొదటి రోజు తెలుగులో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే మొదటి షో పడిన తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. దీనికోతోడు ఈ వారం తెలుగులో రిలీజ్ సినిమాలు తేలిపోవడంతో డ్రాగన్ కి కలెక్షన్లు పెరుగుతున్నాయి. దీంతో షోలు కూడా పెంచినట్లు సమాచారం.
#Dragon crosses 100crs pic.twitter.com/RVvQetBy2u
— Pradeep Ranganathan (@pradeeponelife) March 2, 2025