
లవ్ టుడే మూవీ ఫేమ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ శుక్రావారం(ఫిబ్రవరి 21) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మంచి యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా కాలజీ లైఫ్, జాబ్ లైఫ్, ప్రేమ పెళ్లి వంటి విషయాల్ని బేస్ చేసుకుని రాసిన స్క్రిప్ట్ చక్కగా వర్కవుట్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ రోజు తెలుగు, తమిళ్ లాంగ్వేజస్ లో దాదాపుగా రూ.6.75 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేక పోయినప్పటికీ మౌత్ పబ్లిసిటీ పెరగడంతో కలెక్షన్స్ స్టేబుల్ గా ఉన్నాయి.
అయితే Sacnilk సమాచారం ప్రకారం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇప్పటివరకూ దాదాపుగా రూ.65 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకుంది. దీంతో ప్రస్తుతం దర్శకనిర్మాతలకి లాభాలు తెచ్చిపెడుదతోంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాకి ఓరి దేవుడా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్, KS రవి కుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్, మరియం జార్జ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ సంగీతం అందించగా ప్రముఖ సినీ నిర్మాత అర్చన కల్పాతి నిర్మించింది.