Dragon Trailer: మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో.. లవ్‌టుడే హీరో ప్రదీప్‌ రంగనాథన్.. డ్రాగన్ ట్రైలర్ రిలీజ్

Dragon Trailer: మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో.. లవ్‌టుడే హీరో ప్రదీప్‌ రంగనాథన్..  డ్రాగన్ ట్రైలర్ రిలీజ్

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. తమిళ సూపర్ టాలెంటెడ్ నటుడు అండ్ దర్శకుడు. కోమలి(Komali) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్..ఆ తరువాత హీరోగా లవ్ టుడే (Love Today) సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్కు క్రేజ్ బాగాపెరిగింది. అందుకే ఆయన చేస్తున్న సినిమాలపై కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

లేటెస్ట్గా హీరో ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓ మై కడవులే ఫేం అశ్వత్‌ మారిముత్తు ఈ  దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2 నిమిషాలకి పైగా ఉన్న ఈ డ్రాగన్ ట్రైలర్ ఆసక్తికర అంశాలతో సాగింది. కాలేజీ నేపథ్యం, హీరో హీరోయిన్స్ లవ్, ఎమోషన్స్ ఇంటెన్స్ సీన్స్తో అట్ట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుందనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

అయితే, కొన్ని సార్లు కాలేజీ స్టూడెంట్స్‌ అటెన్షన్‌, పాపులారిటీకి ఎలా బానిసలవుతారనే దాని చుట్టూ సినిమా ఉంటుందని ఇటీవలే డైరెక్టర్ అశ్వత్‌ మారిముత్తు తెలిపారు. ఈ సినిమాలో ప్రదీప్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ నటిస్తున్నారు. ఫిబ్రవరి 21న డ్రాగన్ థియేటర్స్లో రిలీజ్ కానుంది. 

ప్రస్తుతం ప్రదీప్ రంగ‌నాధ్ హీరోగా 'ఎల్ ఐ సీ'(LIC) Love Insurance Corporation) అనే మూవీలో నటిస్తున్నాడు. నయనతార(Nayanthara) భర్త విగ్నేష్ శివన్(Vigneshshivan) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.