స్కూల్ అంటే విద్యార్థులకు దేవాలయంతో సమానం..అక్కడ వారి భవిష్యత్తుకు వేయడం టీచర్ల బాధ్యత. టీచర్లను పనితీరును పరిశీలించేందుకు ప్రిన్సిపాల్ పోస్టు.. కానీ అటువంటి బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఓ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం చూస్తే..వీడేంట్రా బాబు..శాడిస్టులా ఉన్నాడు..విద్యాబుద్ధులు చెప్పాల్సిన స్కూళ్లో చేయకూడని పనులు చేయిస్తున్నాడు..వీడు మనిషేనా అనిపిస్తుంది. స్కూల్లోనే ఓ టీచర్ ను.. పైగా లేడీ టీచర్ చేత చేయకూడని పనులు చేయమని ఆజ్ణాపించాడు.. వినలేదని గోడకుర్చి వేయించాడు.
అది యూపీలోని జబల్ పూర్ లోని సోలివాడలో ఓ కాన్వెంట్ స్కూల్. స్కూల్ ప్రిన్సిపాల్ క్షితిజ్ జాకబ్ వేధింపులు భరించలేక అదే కాన్వెంట్ లో పనిచేస్తున్న లేడీ టీచర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రిన్సిపాల్ జాకబ్ గత రెండే ళ్లుగా లేడీ టీచర్ ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీ పనితీరు బాగాలేదు.. చర్చించాలి ప్రిన్సిపాల్ రూంకు రావాలని రోజూ పిలుస్తూ వేధించేవాడు. అంతేకాదు..తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ తాగాలని బలవంత పెట్టేవాడు. తిరస్కరించినందుకు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.
ALSO READ : గోల్డెన్ టెంపుల్లో సుఖ్ బీర్ సింగ్ బాదల్పై కాల్పులు
కొన్ని సార్లు స్కూల్ బయట గోడ కుర్చి వేయించేవాడు.. ఉద్యోగం తీసేస్తానని బెదిరించేవాడు.. దీంతో ఉద్యోగం పోతే ఉపాధి పోతుందని భయపడిన ఆ టీచర్.. రెండేళ్లే ప్రిన్సిపాల్ శాడిజాన్ని భరించింది..ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువకావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ప్రిన్సిపాల్ క్షితిజ్ జాకబ్ బాగోతం బయటపడింది.
ప్రిన్సిపాల్ జాకబ్ పై లేడీ టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సాగుతోంది. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే.. క్షితిజ్ జాకబ్ తనపై వస్తున్న ఆరోపణలపై నోరు విప్పకపోవడం.