
- ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రధానమంత్రి జనరిక్ మెడిసిన్స్ పై డీఎంహెచ్‌ఓ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య శాఖ సిబ్బంది, జనరిక్ మెడిసిన్ షాప్ యజమానులు శనివారం జగిత్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందించడానికి ప్రధానమంత్రి జనరిక్ మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
డయాబెటిస్ , బీపీ దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మాత్రలు తక్కుధరలకే లభిస్తాయని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ సత్యనారాయణ, సీహెచ్ఓ శ్రీధర్, హెచ్ఇఓ రాంకుమార్, శ్రీధర్ రాజేశం, హెల్త్ ఎడ్యుకేటర్స్ భూమేశ్వర్, శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు శ్యామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.