రోడ్డు పై పొంగి పొర్లుతున్న డ్రైనేజీ

 రోడ్డు పై పొంగి పొర్లుతున్న డ్రైనేజీ
  • ప్రగతినగర్​ రూట్​లోనెలలుగా ఇదే సమస్య

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట కార్పొరేషన్​ పరిధిలోని పలు కాలనీల్లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ కాలనీ మీదుగా ప్రగతినగర్​వైపు వెళ్లే దారిలో శ్రీసాయి ఎవెన్యూ వద్ద కొన్ని నెలలుగా నిత్యం అండర్​ గ్రౌండ్ ​డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్నది.

ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్డు సక్రమంగా లేకపోవడంతో పొంగిన డ్రైనేజీ నీరు రోడ్డు గుంతల్లో నిలిచిపోతుంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మురుగు నిల్వ ఉండడంతో దోమలు విజృంభించి రోగాల బారిన పడుతున్నామని, ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.