
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రేగ్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో వరుసగా మూడో డ్రా ఎదుర్కొన్నాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞా 46 ఎత్తుల తర్వాత టర్కీ ప్లేయర్ గురెల్ ఎడిజ్‌తో పాయింట్ పంచుకున్నాడు. ఇదే రౌండ్‌లో మరో ఇండియా జీఎం అరవింద్ చిదంబరం జర్మనీకి చెందిన విన్సెంట్ కేమర్‌పై అద్భుత విజయం సాధించాడు.
నల్లపావులతో ఆడిన అతను 45 ఎత్తుల్లో విన్సెంట్‌కు చెక్ పెట్టాడు. మరో ఏడు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో అరవింద్ 1.5 పాయింట్లతో అమెరికా జీఎం సామ్ శాంక్లాండ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు చాలెంజర్స్ విభాగాన్ని ఓటమితో ఆరంభించిన ఇండియా అమ్మాయి దివ్యా దేశ్‌ముఖ్ రెండో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన రిచార్డ్ స్టాల్మచ్‌ను ఓడించింది.