
స్టావెంజర్: ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. క్లాసికల్ ఫార్మాట్‌లో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)కు చెక్ పెట్టాడు. నార్వే చెస్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 37 ఎత్తులతో కార్ల్‌సన్‌పై నెగ్గాడు. గతంలో జరిగిన ఆన్‌లైన్ గేమ్‌ల్లో కార్ల్‌సన్‌పై నెగ్గిన ప్రజ్ఞానంద లాస్ట్ వరల్డ్ కప్‌లో అతని చేతిలో ఓడాడు. కానీ ఇప్పుడు తన టాలెంట్‌తో డైరెక్ట్ విజయాన్ని అందుకున్నాడు. సిసిలియన్ స్ట్రాటజీతో గేమ్ మొదలుపెట్టిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ మధ్యలో కార్ల్‌సన్ ‘కింగ్’కు అడ్డుకట్ట వేశాడు.
ఇక్కడి నుంచి డేంజరస్ ఎత్తులతో నార్వే ప్లేయర్‌కు చెక్ పెట్టి చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద ఐదున్నర పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. విమెన్స్ సెక్షన్‌లో ఆర్. వైశాలి (5.5).. అనా ముజిచెక్ (ఉక్రెయిన్, 3)పై గెలిచింది. మరో గేమ్ లో కోనేరు హంపీ(3)..టింగ్లీ లీ(చైనా 4ను), ఓడించింది.