
ప్రేగ్: ఇండియా గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం.. ప్రేగ్ చెస్ మాస్టర్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌ను అరవింద్ డ్రా చేసుకున్నాడు.
గురెల్ ఎడిజ్ (టర్కీ, 4.5)తో జరిగిన ఈ గేమ్‌ను 39 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. మూడు విజయాలు, ఆరు డ్రాలతో ఆరు పాయింట్లు నెగ్గిన అరవింద్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆర్. ప్రజ్ఞానంద (5).. అనిష్ గిరి (నెదర్లాండ్స్, 5) మధ్య జరిగిన గేమ్ కూడా 50 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది.
దీంతో ఈ ఇద్దరు సంయుక్తంగా రన్నరప్‌గా నిలిచారు.