ప్రేగ్‌‌‌‌ మాస్టర్స్‌ 2025.. ప్రజ్ఞానంద తొలి గేమ్‌‌‌‌ డ్రా

 ప్రేగ్‌‌‌‌ మాస్టర్స్‌ 2025.. ప్రజ్ఞానంద తొలి గేమ్‌‌‌‌ డ్రా

ప్రేగ్‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. ప్రేగ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో తొలి రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. డేవిడ్‌‌‌‌ నవారో (చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌)తో జరిగిన ఈ గేమ్‌‌‌‌ను 66 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. దీంతో ఇద్దరు ప్లేయర్లు పాయింట్‌‌‌‌ను పంచుకున్నారు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానందను క్వీన్‌‌‌‌ గాంబిట్‌‌‌‌ స్ట్రాజటీతో నవారో కట్టడి చేశాడు. చివరకు ఓ పాన్‌‌‌‌ను త్యాగం చేసిన నవారో గేమ్‌‌‌‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. 

చివరి వరకు పోరాడిన ప్రజ్ఞానంద గట్టెక్కలేకపోయాడు. అరవింద్‌‌‌‌ చిదంబరం.. నగుయెన్‌‌‌‌ థాయ్‌‌‌‌ డాయ్‌‌‌‌ వాన్‌‌‌‌ (చెక్‌‌‌‌) మధ్య జరిగిన గేమ్‌‌‌‌ కూడా 46 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో విన్సెంట్‌‌‌‌ కీమర్‌‌‌‌ (జర్మనీ).. వీ యి (చైనా)పై, సామ్‌‌‌‌ షక్లాండ్‌‌‌‌ (అమెరికా).. గురెల్‌‌‌‌ ఎడిజ్‌‌‌‌ (టర్కీ)పై గెలవగా, లి క్వియంగ్‌‌‌‌ లిమ్ (వియత్నాం).. అనిష్‌‌‌‌ గిరీ (నెదర్లాండ్స్‌‌‌‌) మధ్య జరిగిన గేమ్‌‌‌‌ డ్రాగా ముగిసింది.