ప్రేగ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీ.. టాప్‌‌‌‌‌‌‌‌లోనే ప్రజ్ఞా, అరవింద్‌‌‌‌‌‌‌‌

ప్రేగ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీ.. టాప్‌‌‌‌‌‌‌‌లోనే ప్రజ్ఞా, అరవింద్‌‌‌‌‌‌‌‌

ప్రేగ్‌‌‌‌‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్లు ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం ప్రేగ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఐదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో తలపడ్డ తోటి ఆటగాళ్లు తమ గేమ్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్నారు. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రజ్ఞా, అరవింద్‌‌‌‌‌‌‌‌ చెరో 3.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. టాప్ సీడ్ వీ యి (చైనా), అనీష్ గిరి (హోలాండ్‌‌‌‌‌‌‌‌), క్వాంగ్ లీమ్ లె (వియత్నం), కేమర్ (జర్మనీ) తలో 2.5 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ ఐదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆండ్రియా (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడింది.