ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్.. ప్రజ్ఞా, అరవింద్ గేమ్స్ డ్రా

ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్.. ప్రజ్ఞా, అరవింద్ గేమ్స్ డ్రా

ప్రేగ్‌: ఇండియా గ్రాండ్‌ మాస్టర్లు ఆర్‌. ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం ప్రేగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో సత్తా చాటుతున్నారు. సోమవారం (మార్చి 3) జరిగిన ఆరో రౌండ్‌లో ఇద్దరు ప్లేయర్లు తమ ప్రత్యర్థులతో పాయింట్ పంచుకున్నారు. 

అమెరికా ఆటగాడు సామ్ శాంక్‌లాండ్‌తో తెల్లపావులతో తలపడ్డ ప్రజ్ఞా  43  ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించాడు. ఇదే రౌండ్‌లో వియత్నాం గ్రాండ్ మాస్టర్‌‌ లీ క్వాంగ్​ లియెమ్‌తో పోటీ పడ్డ అరవింద్ 32 ఎత్తుల తర్వాత డ్రా చేసుకున్నాడు. 

మరో మూడు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో ప్రజ్ఞా, అరవింద్‌ చెరో 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.