Pragya Jaiswal: బాలయ్య నా లక్కీ చార్మ్ అంటున్న తెలుగు హీరోయిన్..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ సంక్రాంతి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. 

ఈ సందర్బంగా బాలయ్య తన లక్కీ చార్మ్ అని చెప్పేసింది. బాలయ్య కారణంగానే తనకు అవకాశాలు వస్తున్నాయని అంటోందీ అమ్మడు.  డాకు మ‌హారాజ్ లో ఛాన్స్ కి కార‌ణం ద‌ర్శ‌కుడు బాబి అంది. క‌థ‌లే త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తునాయని..తాను వాటి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం లేద‌ని తెలిపింది. బాల‌య్య‌తో వ‌రుస‌గా క‌లిసి ప‌నిచేయ‌డం ఓ గొప్ప అవ‌కాశంగా భావిస్తోందీ అమ్మడు. 

Also Read :- మాజీ భార్యతో స్టార్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్

అఖండ సినిమా త‌న రాత‌ను మార్చేసిందంది. కోవిడ్ స‌మ‌యంలో బోయ‌పాటి పిలిచి ఇచ్చిన అవ‌కాశంగా పేర్కొంది. ఆయన నుంచి పిలుపు రాగానే ముంబై నుంచి హ్యాండ్ బ్యాగ్ తో హైద‌రాబాద్ లో దిగిపోయానంది. క‌థ చెప్పిన గంట‌లోపే ప్రాజెక్ట్ ఖ‌రారైందట‌. ఇప్పుడు అఖండ -2`లోనూ త‌న‌ని భాగం చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసింది. ఇక బాల‌య్య‌ని `బాల అని ముద్దుగా పిలిచే హీరోయిన్ల‌లో ప్రగ్యాజైశ్వాల్ కూడా ఉంది. ఆయ‌న్ని స‌ర్ అని పిల‌వ‌డం ఇష్టం ఉండ‌ద‌ని ఇటీవ‌లే శ్ర‌ద్దా శ్రీనాధ్ ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.