Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ విషయంపై స్పందించిన డాకు మహారాణి..ఏమన్నారంటే?

Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ విషయంపై స్పందించిన డాకు మహారాణి..ఏమన్నారంటే?

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్ జంటగా నటించిన చిత్రం డాకు మహరాజ్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా హిట్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కావేరి పాత్రలో మెప్పించింది హీరోయిన్ ప్రగ్యా  జైస్వాల్. ఈ అమ్మడు బాలకృష్ణతోనే వరుస అవకాశాలు దక్కించుకుంటు తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా కూడా హిట్ అయ్యింది. 

లేటెస్ట్గా ప్రగ్యా  జైస్వాల్ (Pragya Jaiswal) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో డాకు మహరాజ్ హిట్ పై స్పందించింది. తన పుట్టిన రోజు నాడే 'డాకు మహారాజ్' విడుదలై విజయాన్ని అందుకుందంటోంది. ఈ ఏడాది తనకు అద్భుతంగా ప్రారంభమైందని చెప్పింది. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది.

'డాకు మహారాజ్' విడుదలైన దగ్గర నుంచి తనను అందరూ 'డాకు మహారాణి' అని పిలుస్తున్నారని చెబుతోంది. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమం టోంది. గర్భిణి పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని చెప్పింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించిందని అంటోంది ప్రగ్యా.

ALSO READ | Upasana: ఆమె ఒక్క క్లాస్‌ కూడా మిస్ అవ్వదు.. ఉపాసన స్పెషల్‌ పోస్ట్‌

అలాగే బాలకృష్ణ గురించి చెబుతూ.. 'కెమెరా ఆన్, ఆఫ్ మధ్యలో సులభంగా ఎలా మారొచ్చో బాలయ్య లాంటి లెజెండ్ దగ్గర చాలా నేర్చుకోవచ్చని.. ఆయనకు ఎలాంటి ఫిల్టర్స్ ఉండవని చెప్పింది. చాలా గౌరవంగా ఉంటారు. అందరినీ సమానంగా చూస్తారు. మొత్తంగా బాలయ్య చాలా మంచి వ్యక్తి. చాలా సహకారం అందించే నటుడని ప్రగ్యా తెలిపింది.

అంతేకాకుండా బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ విషయంలో మీరేం చెబుతారని అడగ్గా..  'నటిస్తున్నప్పుడు మీ పాత్రను ఎలా రాశారన్న దానిపై నటీనటులను తీసుకుంటారని నేను అనుకుంటా. పాత్రకు న్యాయం చేయగలిగితే.. స్క్రీన్‍పై బాగా కనిపిస్తే చాలు. ఇక ఏజ్ గ్యాప్‍ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అని  ప్రగ్యా  జైస్వాల్ క్లారిటీ ఇచ్చింది.

అయితే, బాలకృష్ణ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు కాగా.. ప్రగ్యా జైస్వాల్‍కు 37. ఇద్దరి మధ్య సుమారు 27ఏళ్ల గ్యాప్ ఉంది. దీంతో వీరి కాంబినేషన్ పై నెటిజన్ల నుంచి కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ, అది ఎక్కడ కనిపించకుండా వీరి నటించడం మెచ్చుకోదగ్గ విషయం.