
భారత్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ ఛాంపియన్ షిప్‌లో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా అదే ఛాంపియన్ షిప్ లో వరల్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మాగ్నస్ కార్లసన్ ను ఓడించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన 5వ రౌండ్ పోటీలో సెకండ్ ప్లేస్ లో ఉన్న గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాను ప్రజ్ఞానంద్ ఓడించాడు. ఈ విజయం పట్ల పలువురు ప్రజ్ఞానంద్ ని ప్రసంశించారు.
నార్వేలో జరుగుతున్న క్లాసికల్ చెస్ టోర్నమెంట్ లో వరల్డ్ సెకండ్ ర్యాంకర్ ఫాబియానో కరువానాని చిన్న వయస్కుడైన ప్రజ్ఙానంద్ ఓడించడం గొప్ప విషయం. మొదటి టాప్ ర్యాంకర్లపై ప్రజ్ఞానంద్ విజయం సాధించడం ఇండియాకే గర్వకారణం. ఈ వరుస విజయాలు అతను వరల్డ్ టాప్ లో నిలిచేందుకు సహయపడతాయని కొందరు అంటున్నారు.